తెలంగాణ

telangana

పట్టాలు తప్పిన రైలు.. ప్రయాణికులంతా లక్కీగా..

By

Published : Jan 13, 2023, 1:55 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

జమ్ముకశ్మీర్​లోని బడ్​గామ్​లో బన్హాల్​ నుంచి బారాముల్లా వెళ్తున్న రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం మజ్​మా రైల్వే స్టేషన్​కు చేరుకుంటున్న సమయంలో ట్రాక్ మారుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ట్రాక్​పై రైలు సర్వీసులు నిలిపివేశారు. 

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details