తెలంగాణ

telangana

మామిడి జీడితో ఇలా చేస్తే వడదెబ్బకు చెక్!.. ఆయుర్వేద చిట్కా ట్రై చేస్తారా?

By

Published : May 21, 2023, 5:28 PM IST

మామాడి జీడితో ఇలా చేస్తే వడదెబ్బకు చెక్.. ఆయుర్వేద చిట్కా ట్రై చేస్తారా?

ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఈ వేడికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలి ప్రాణాలు మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం, వేసుకొనే దుస్తులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇదిలా ఉంటే మనం తినే మామిడి పండులో ఉండే గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా పండు లోపల ఉండే గింజ (జీడి) కూడా మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మామిడి పండు.. అందరికి ఇష్టమైందే. పండ్ల‌ల్లో కింగ్ మామిడి పండు అయితే వేస‌విలో మాత్ర‌మే ల‌భించే ఈ పండు లోపలి గింజ (జీడి) తిన‌డం వల‌న క‌లిగే ఆరోగ్య‌ప‌ర‌మైన లాభాలు తెలిస్తే మీరు ఈ పండును అస్స‌లు వ‌ద‌ల‌రు. అయితే అందరూ మామిడి పండును తిన్నాక దాని లోపల ఉండే జీడిని చెత్త కుప్పలో పారేస్తారు. కానీ, మీకు తెలుసా? పనికిరాదని భావించే ఆ మామిడి జీడిని ఉపయోగించి వడదెబ్బ నుంచి ఉపశమనం పొందొచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ వీడియోను చూడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details