తెలంగాణ

telangana

అభయహస్తం కోసం 'ఆధార్‌' తిప్పలు - మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 1:55 PM IST

Aadhaar Update Issues in Hyderabad

Aadhaar Update Issues in Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కానీ దీనికి ఆధార్ అప్​డేట్ ప్రస్తుతం ప్రజలకు అవరోధంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్​లో జనాలకు ఆధార్ తిప్పలు తప్పడం లేదు. అభయ హస్తం గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, రేషన్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో చేర్పులు, మార్పుల కోసం ప్రజలు మీ సేవ కేంద్రాలు, ఆధార్ నమోదు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

People Rush at Aadhaar Center in LB Nagar: ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఆధార్ కార్డులో మార్పుల కోసం తెల్లవారు జామున 3 గంటల నుంచే ప్రజలు మీ సేవ కేంద్రాల వద్ద క్యూలో నిల్చుంటున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూ లైన్లలో పెట్టి తమ నెంబర్ కోసం నిరీక్షిస్తున్నారు. రోజుకు 100 మందికి మాత్రమే ఆధార్ కార్డులను అప్ డేట్ చేస్తుండటంతో మిగతా వారంతా మూడు నాలుగు రోజుల నుంచి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details