తెలంగాణ

telangana

ఘనంగా పుట్టినరోజు వేడుకలు మనిషికైతే కాదు.. ఎవరికంటే!

By

Published : Mar 15, 2023, 10:26 AM IST

పుట్టినరోజు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చేసుకునే వేడుక. ప్రస్తుత కాలంలో ఇలాంటి వేడుకలను తాము పెంచుకుంటున్న జంతువులకు కూడా చేస్తున్నారు. అయితే అది ఎక్కువ శాతం కుక్కలకు నిర్వహించడం చూసి ఉంటాం. కానీ ఓ వ్యక్తి నిర్వహించిన పుట్టినరోజు వేడుకలను చూసి ఆ గ్రామంలోని ప్రజలు అవాక్కయ్యారు. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా.. అతను తాను పెంచుకుంటున్న మేకపోతుకు జన్మదిన వేడుకలు నిర్వహించాడు. 

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో చాకలి వెంకటేష్ అనే వ్యక్తి ఓ మేకపోతును పెంచుకుంటున్నాడు. అయితే అలా పెంచుకుంటున్న పోతుకు సంవత్సరం దాటిందని.. బాగా బలిష్టంగా పెరిగిందని సంతోష పడి పుట్టినరోజు వేడుకలు జరపాలని నిర్ణయించాడు. ఈ వేడుకలకు ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. కేక్ తెప్పించి మేకపోతుకు బెలూన్​లు కట్టి అందంగా అలంకరించారు. అనంతరం కేక్ కట్ చేసి వచ్చిన పిల్లలకు, అతిథులకు పంచి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీని గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. మరికొద్దిమంది మేకపోతుపై అతనికున్న ప్రేమను పొగుడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details