తెలంగాణ

telangana

100 yrs old man doing Yoga : ఈ తాత మామూలోడు కాదు.. వందేళ్ల వయసులో యోగాసనాలు ఇరగదీశాడు

By

Published : Jun 21, 2023, 12:16 PM IST

Yoga Master Balayya Story in Jagtial

100 Years Old man story in Jagtial : అతని వయస్సు వందేళ్లు.. కానీ 20 ఏళ్ల యువకుడిలా వొల్లును విల్లులా విరిచినట్లు యోగాసనాలు వేస్తుంటారు. అతను యోగాసనాలు వేయడమే కాదు శిక్షణ కూడా ఇస్తున్నారు. వయసులో సెంచరీ కొట్టినా.. ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వృద్ధుడు వేస్తున్న ఆసనాలు చూసి.. వావ్​ అంటున్నారు. 

జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన బాలయ్య ఇటీవలే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. చిన్నతనం నుంచి యోగాపై ఎంతో మక్కువతో నేర్చుకున్నారు. బెంగళూరులోని శ్రీ వివేకానంద యోగ శిక్షణా కేంద్రంలో సంవత్సరం పాటు ట్రైనింగ్​ పొందారు. ఇతరులకు ఉచితంగా యోగా నేర్పించేందుకు.. మెట్​పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంట పాటు యోగా తరగతులు చెబుతున్నారు. మెట్​పల్లిలోనే కాకుండా జగిత్యాల్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్.. తదితర ప్రాంతాల్లో యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తూ.. వందలాది మందికి యోగాపై అవగాహన కల్పిస్తున్నారు. ఆసనాలు వేస్తే.. ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతామని యోగా గురువు బాలయ్య అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details