తెలంగాణ

telangana

మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన రవాణా, విమానాలు రద్దు

By

Published : Jan 30, 2022, 10:22 AM IST

Updated : Jan 30, 2022, 11:47 AM IST

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రధానంగా న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియా నగరాల్లోని రహదారులపై అడుగుమేర మంచు పేరుకుపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శీతలగాలుల తీవ్రతతో ఈ హిమపాతం మరో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం అంచనావేసింది. తుపాను కారణంగా అత్యవసర సేవలు మినహా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంచుతుపాను ధాటికి దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్‌, షికాగో, బోస్టన్‌ రాష్ట్రాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మంచులో నిండిపోయాయి.
Last Updated :Jan 30, 2022, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details