తెలంగాణ

telangana

మ్యాచ్​ జరుగుతుండగానే.. మైదానంలో టెడ్డీ బేర్ల వర్షం!

By

Published : Jan 23, 2022, 1:09 PM IST

అప్పటివరకు ప్రేక్షకుల దృష్టంతా ఆటమీదే ఉంది. ఓ ప్లేయర్ దూసుకొని వెళ్లి గోల్ కొట్టేశాడు. అంతే.. ప్రేక్షకుల హవా షురూ. ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న టెడ్డీ బేర్లను రింక్​లోకి (ఐస్ హాకీ ఆడే మైదానం) విసిరారు. టెడ్డీబేర్ల వర్షం కురిసిందా అనేలా.. వేల సంఖ్యలో బొమ్మలు మైదానంలో కనువిందు చేశాయి. అమెరికా పెన్సిల్వేనియాలోని హర్ష్​లీలో ఉన్న గెయింట్​ సెంటర్​లో ఈ దృశ్యం కనిపించింది. ఐస్ హాకీ ఆటలో ఇలాంటిది తరచుగా కనిపించేదే. ఇది అమెరికాలో సంప్రదాయంగా వస్తోంది. ఈ బొమ్మలన్నింటినీ సేకరించి.. వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు నిర్వాహకులు. 2001 నుంచి 2.7 లక్షల బొమ్మలను ఇలా సమీకరించారు. 2019లో 45,650 టెడ్డీలను విసిరి రికార్డు సృష్టించారు ప్రేక్షకులు. ఆరోజు జరిగిన మ్యాచ్ అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇక.. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది.

ABOUT THE AUTHOR

...view details