తెలంగాణ

telangana

TFCC Elections 2023 : దిల్​రాజు X కల్యాణ్​.. ఉత్కంఠగా పోలింగ్​

By

Published : Jul 30, 2023, 11:00 AM IST

ఫిల్మ్​ ఛాంబర్​ ఎన్నికలు

TFCC Elections : తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి ఎన్నికల పోలింగ్​ అట్టాహాసంగా ప్రారంభమైంది.  ప్రతి రెండేళ్ల కోసారి జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో తాజాగా అధ్యక్ష బరిలోకి నిర్మాతలు దిల్‌రాజు, సి.కళ్యాణ్ పోటీ పడుతున్నారు. ఇక ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో ఓనర్స్ సభ్యులుగా ఉన్న ఈ వాణిజ్య మండలిలో ఒక్కొక్కరిగా వచ్చి తమకు నచ్చిన ఫ్యానెల్‌లోని సభ్యులకు ఓట్లు వేస్తున్నారు. నిర్మాతలు సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, సుప్రియ, రాఘవేందర్ రావు, పోసాని కృష్ణ మురళీ సహా మరో 104 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణం సందడిగా మారింది. 

ఉదయం నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్​లో ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే  మొదట్లో పలు ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్​లో కాస్త అంతరాయం కలిగింది. ఆ తర్వాత సిబ్బంది ఈవీఎం సమస్యలను పరిష్కరించడం వల్ల పోలింగ్ సజావుగా కొనసాగుతుంది.  మధ్యాహ్నాం 3 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఫలితాలను వెల్లడించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details