తెలంగాణ

telangana

'రక్షణ రంగంలో కీలకంగా తేజస్​ యుద్ధవిమానాలు'

By

Published : Jan 27, 2021, 11:20 AM IST

ఆత్మనిర్భర్​ భారత్ అభియాన్ ద్వారా 83 తేజస్ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దేశ రక్షణ రంగంలో కీలక మలుపుగా భారత వాయుసేన విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాసు అభివర్ణించారు. స్వదేశీ యుద్ధ విమానాల వల్ల నిరంతర సర్వీసింగ్, ఆధునికీకరణ సులువవుతుందన్నారు. దేశీయ పరిస్థితులకు అవసరమైన కచ్చితత్వంతో కూడిన యుద్ధవిమానాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారాయన. నాలుగైదేళ్లలో తేజస్ విమానాలు వాయుసేనకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. తేజస్ సామర్థ్యాన్ని వివిధ రూపాల్లో పరీక్షించిన తర్వాతే సుమారు రూ.45 వేల కోట్లతో వీటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కాళిదాసు పేర్కొన్నారు. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో కీలక విషయాలు వెల్లడించారు కాళిదాసు.

ABOUT THE AUTHOR

...view details