తెలంగాణ

telangana

బారికేడ్లు విరగ్గొట్టి రోడ్డు దాటిన గజరాజులు

By

Published : Dec 4, 2019, 2:44 PM IST

తమిళనాడు కోయంబత్తూర్ లోని నరసింహనాయకన్​ పాళ్యంలో రహదారిని దాటి మరోవైపు వెళ్లేందుకు ప్రయత్నించిందో ఏనుగుల గుంపు. అయితే ఇటీవలే రహదారి నవీకరణ జరిగి మధ్యలో ఏర్పాటు చేసిన బారికేడ్లు గజరాజులకు అవాంతరంగా మారాయి. ముందుగా వచ్చిన 'లీడర్' ఏనుగు బారికేడ్లను తొండంతో కొట్టింది. బారికేడ్లు కూలిపోాగా... వాటి పైనుంచి ఠీవీగా తమ 'రహదారి మార్చ్' కొనసాగించాయి గజరాజులు. ఈ ప్రయాణానికి ఆటంకం కలగకుండా ఇరువైపులా కాసేపు వాహనాలను నిలిపేశారు అటవీ శాఖ అధికారులు.

ABOUT THE AUTHOR

...view details