తెలంగాణ

telangana

Elephant Attack Video: అతడ్ని వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు!

By

Published : Dec 20, 2021, 12:50 PM IST

అసోంలోని ధుబ్రి జిల్లాలోని స్థానికులపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్‌హాట్‌ ప్రాంతంలోని నదిలో నుంచి జనవాసాల్లోకి వచ్చిన ఏనుగు.. స్థానికులపై ప్రతాపం చూపింది. భయాందోళనతో ప్రజలు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పడిపోయాడు. అతడిని సమీపించిన ఏనుగు తొండంతో ఈడ్చిపడేసింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయిన తర్వాత యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అటవీశాఖ అధికారి వెల్లడించారు. స్థానికులపై దాడిచేసిన ఏనుగు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details