తెలంగాణ

telangana

మహిళా పోలీసు సాహసం.. వరద బాధితుడిని భుజాలపై మోసుకెళ్లి..

By

Published : Nov 11, 2021, 3:46 PM IST

Updated : Nov 11, 2021, 5:25 PM IST

వరదలు సృష్టించిన బీభత్సంతో(tamil nadu rain) అల్లాడుతున్న చెన్నైలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. టీపీ చత్రం పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ రాజేశ్వరి స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు(tamil nadu rain updates). ఉదయ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడారు. స్థానిక శ్మశానవాటికలో పనిచేసే ఉదయ.. వర్షాల కారణంగా కొన్నిరోజులుగా అక్కడే ఉండిపోయాడు. వర్షాలకు తడిసి స్పృహకోల్పోయాడు. గురువారం ఆయన్ని చూసిన స్థానికులు ఉదయ మరణించాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లేసరికి ఆయన బతికే ఉన్నాడని పోలీసులకు తెలిసింది. వెంటనే ఉదయను ఆ మహిళా పోలీసు తన భుజాలపై మోసుకెళ్లి పరుగులుతీస్తూ ఆటో ఎక్కించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రాణాన్ని సమయస్ఫూర్తితో రక్షించారంటూ ఆమెపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Last Updated :Nov 11, 2021, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details