తెలంగాణ

telangana

సచిన్​ను అధిగమించిన కోహ్లీ.. పాక్​పై గెలుపుతో భారత్ రికార్డులు

By

Published : Oct 23, 2022, 6:45 PM IST

పాకిస్థాన్​తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్​ విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా మీద ఉన్న రికార్డు బద్ధలు కొట్టింది టీమ్ ఇండియా. సచిన్ పేరున ఉన్న రికార్డును తిరగరాశాడు విరాట్​ కోహ్లీ. అవేంటంటే..

virat kohli records
virat kohli records

పాకిస్థాన్‌తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్​లో భారత్​ ఘన విజయం సాధించింది. దీంతో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అన్ని ఫార్మాట్‌లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను అధిగమించి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకొంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకొంది. చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా గెలవడం వల్ల ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో 38 విజయాలను నమోదు చేసినట్లైంది. 2003లో రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా కూడా 30 వన్డేలు, 8 టెస్టుల్లో గెలిచి.. రికార్డు సృష్టించింది. ఇప్పుడు టీ20 ప్రపంచకకప్‌లో తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి భారత్ కూడా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

'కింగ్​' కోహ్లీ కూడా..
మెల్​బోర్న్ క్రికెట్​ గ్రౌండ్​ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఒంటి చెత్తే జట్టును విజయ తీరాలకు నడిపించాడు. దీంతో ఓ అరుదైన రికార్డున సైతం బద్దలు కొట్టాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను అధిగమించాడు. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా ప్రస్తుతం సచిన్‌, కోహ్లీ కొనసాగుతున్నారు. వీరిద్దరూ చెరో 23 సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఇందులో సచిన్‌ ఏడు శతకాలు, 16 అర్దశతకాలు ఉండగా.. కోహ్లీ 2 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. అయితే, సచిన్‌ కేవలం వన్డేల్లోనే సాధించగా.. విరాట్ కోహ్లీ రెండు ఫార్మాట్లలో (వన్డేలు, టీ20లు) చేయడం విశేషం. పాకిస్థాన్‌ మీద మంచి రికార్డు ఉన్న కోహ్లీ ఇప్పుడు (82*) పరుగులు చేసిన.. మాస్టర్​ బ్లాస్టర్​ పేరున ఉన్న రికార్డును అధిగమించాడు.

హార్దిక్ 1000 పరుగులు..
పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ, పాండ్య శతక భాగస్వామ్యం జోడించారు. ఈ మ్యాచ్​లో పాండ్య 40 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు.

ఇవీ చదవండి :T20 World Cup 2022 అతి పిన్న, పెద్ద వయసు ఆటగాళ్లు వీరే

టీ20 ప్రపంచకప్​పై ధోనీ ఫన్నీ రెస్పాన్స్​.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details