తెలంగాణ

telangana

ఆ సిక్స్‌లతో పాక్‌ ఒత్తిడికి గురవుతుందని తెలుసు: విరాట్

By

Published : Oct 23, 2022, 8:12 PM IST

T20 World Cup : టీ20 వరల్డ్​ కప్​ను భారత్‌ విజయంతో ఆరంభించింది. పాకిస్థాన్‌ మీద 4 వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ చెరరేగిపోయి ఆడి 82 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించాడు. దీంతో రోహిత్ శర్మ విరాట్​ను అభినందించాడు. అలాగే ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకొన్నాడు. మ్యాచ్​ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

india vs pakistan t20 world cup 2022
india vs pakistan t20 world cup 2022

T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ అద్భుత విజయం సాధించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ (82*) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్‌ పాండ్య (40)తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఓడిపోతామనుకొన్న మ్యాచ్‌ను చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ అవార్డు అందుకొన్నాడు.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "ఇదొక అద్భుతమైన వాతావరణం. ఇలాంటి సమయంలో మాటలు రావడం లేదు. ఇది ఎలా జరిగిందో ఐడియా రావడం లేదు. ఎందుకంటే నేను పదాలు మరిచిపోయా. మనం సాధించగలమని హార్దిక్‌ నమ్మాడు. చివర వరకూ క్రీజ్‌లో ఉంటే సాధ్యమేనని అనుకొన్నాం. పెవిలియన్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసిన షహీన్‌ షా అఫ్రిదిని టార్గెట్‌ చేయాలని భావించాం. అలాగే హారిస్‌ రవుఫ్ వారికి చాలా కీలక బౌలర్. ఒక్కసారి హారిస్‌ను ఎటాక్‌ చేస్తే తప్పకుండా పాక్‌ ఒత్తిడికి గురి అవుతుందని తెలుసు. చివరి ఓవర్‌ నవాజ్‌ వేస్తాడు ముందే అనుకొన్నాం. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన తరుణంలో రెండు సిక్స్‌ కొట్టడం నిజంగా అద్భుతం. చివరికి 6 బంతుల్లో లక్ష్యం 16కి వచ్చింది. నా శక్తిసామర్థ్యం మీద నమ్మకం ఉంచా. ఇప్పటి వరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్‌ నా అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజా ఇన్నింగ్స్‌ వచ్చి చేరింది. హార్దిక్‌ చాలా మద్దతుగా నిలిచాడు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం అద్భుతం. మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు." అని తెలిపాడు.

"నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. కానీ, ఎప్పుడూ కంటితడి చూడలేదు. తొలిసారి పాక్‌ మీద విజయం తర్వాత ఇవాళ చూశా. ఇది ఎప్పటికీ మరువలేని సంఘటన" హర్షా భోగ్లే వ్యాఖ్యలు.. పాక్‌ మీద అపూర్వ విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లు చెమర్చాయి. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌పై ఫామ్‌పై ప్రశ్నలు వస్తూనే ఉన్న నేపథ్యంలో.. ఇలా బాధ బయటకు వచ్చినట్లు అభిమానులు చెబుతున్నారు.

విరాట్​ను ఎత్తుకున్న రోహిత్..
అయితే మ్యాచ్​ అనంతరం టీమ్​ ఇండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. భారత జట్టు సారథి రోహిత్​ శర్మ.. కోహ్లీని ఎత్తుకుని కొద్ది సేపు తిప్పాడు. హార్దిక్​ పాండ్య కూడా రోహిత్​ను ముద్దు పెట్టుకున్నాడు. ప్లేయర్లందరూ విరాట్​ను అభినందించారు.

విరాట్​ నువ్వు ఏం చేశావో తెలుసా

"దీపావళి పర్వదినాన ప్రజల జీవితాలలో వెలుగు నింపావు. నువ్వు​ చాలా అద్భుతమైన వ్యక్తివి. నీ పట్టుదల, సంకల్పం, నమ్మకం.. మైండ్ బ్లోయింగ్. నేను నా జీవితంలో బెస్ట్​ మ్యాచ్​ చూశాను. తన తల్లి ఎందుకు అరుస్తూ గెంతుతుందో మన చిట్టి కుమార్తెకు ఇంకా తెలియదు. ఆ రోజు సాయంత్రం తన తండ్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని తనకు ఓ రోజు అర్ధమౌతుంది. ఒక క్లిష్టమైన​ దశ నుంచి ఎలా దృఢంగా, అంతకముందుకన్నా అద్భుతంగా అయ్యాడో అన్న విషయం తెలుస్తుంది" అని మ్యాచ్​ చూస్తున్న ఫొటోలు జత చేసి ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది అనుష్క.నిన్ను చూసి గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చింది.​

ఇవీ చదవండి :India vs Pakistan : ఉత్కంఠ పోరులో భారత్​ ఘన విజయం

T20 World Cup 2022 అతి పిన్న, పెద్ద వయసు ఆటగాళ్లు వీరే

ABOUT THE AUTHOR

...view details