తెలంగాణ

telangana

పాకిస్థాన్‌పై భారత్​ సూపర్‌ విక్టరీ.. నెట్టింట మీమ్స్‌ హల్​చల్​

By

Published : Oct 23, 2022, 10:47 PM IST

ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ సూపర్‌ విజయం సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు సంబంధించి నెట్టింట అనేక మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

ind vs pak t20 meams
పాకిస్థాన్‌పై సూపర్‌ విక్టరీ

Ind Vs Pak: నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును విరాట్‌ కోహ్లీ (82*) అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో.. కోహ్లీ తుది వరకు క్రీజులో నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. విరాట్‌కు హార్దిక్‌ పాండ్య (40) అండగా నిలిచాడు. ఈ గెలుపుతో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు సంబంధించి నెట్టింట అనేక మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

ABOUT THE AUTHOR

...view details