తెలంగాణ

telangana

పీరియడ్స్‌కు ముందు జననాంగంలో నొప్పా? కారణాలు ఇవే!

By

Published : Apr 20, 2023, 10:31 AM IST

పీరియడ్స్ వల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నెలసరి సమయంలో జననాంగంలో వచ్చే నొప్పి, రక్తస్రావం వల్ల నీరసించిపోవడం, చికాకు పడటం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మరికొంతమంది మహిళలకు నెలసరి రావడానికి ఐదు రోజుల ముందే జననాంగంలో నొప్పి వస్తూ ఉంటుంది. అందుకు అసలు కారణాలేంటో తెలుసుకుందాం.

పీరియడ్స్‌కు ఐదు రోజుల ముందే జననాంగంలో నొప్పి వస్తుందా?
పీరియడ్స్‌కు ఐదు రోజుల ముందే జననాంగంలో నొప్పి వస్తుందా?

సాధారణంగా ప్రతి మానవుడి శరీరంలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, చేసే పని, నిద్రపోయే సమయం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఒత్తిళ్లు.. మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల అనారోగ్యాల బారిన పడటం, శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వయసు రీత్యా కూడా శరీరంలో అనేక మార్పులు కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో నెలసరి ఒకటి. అయితే పీరియడ్స్​ అంటేనే మహిళలు భయపడుతూ ఉంటారు! ఆ సమయంలో వచ్చే నొప్పి, రక్తస్రావం, చికాకు, ఇతర సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో బాగా నీరసించిపోతారు. ఎటువంటి పనులు కూడా సరిగ్గా చేయలేక పోతుంటారు. సుమారు ఐదు రోజుల పాటు వారు అస్సలు ఉత్సాహంగా ఉండలేరు.

మరికొంతమంది మహిళలు.. సరైన సమయానికి నెలసరి అవ్వకపోవడం, ఆలస్యంగా రావడం లేదా ముందే రావడం లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. కొందరికి పీరియడ్స్ రాకముందే జననాంగంలో నొప్పి ఉంటుంది. నెలసరి వచ్చే నాలుగైదు రోజుల ముందు నుంచి నొప్పి ప్రారంభమవుతుంటుంది. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్లీ నొప్పి తగ్గిపోయి నార్మల్‌గా ఉంటుంది.

ఎన్నో కారణాలు
పీరియడ్స్‌కు నాలుగైదు రోజుల ముందే జననాంగంలో నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని గైనకాలజిస్ట్ డా. నీలిమ తెలిపారు. డెలివరీ బట్టి కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశముందని చెప్పారు. నార్మల్ డెలివరీతో పోలిస్తే సిజేరియన్ ఆపరేషన్ వల్ల జననాంగంలో పీరియడ్స్‌కు ముందే నొప్పి వచ్చే అవకాశముంటుందని తెలిపారు. కొంతమంది మహిళల్లో ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వల్ల.. నొప్పి వస్తుందని చెప్పారు. గర్భాశయ ఇన్ఫెక్షన్లు కూడా నెలసరికి ముందు జననాంగంలో నొప్పి రావడానికి కారణమని వివరించారు.

ఇన్ఫెక్షన్ల వల్ల గర్భాశయానికి రక్త సరఫరా ఎక్కువవుతుందని, దీని వల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నీలిమ వెల్లడించారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. టెస్టులు చేయించుకుని సరైన చికత్స పొందడం ద్వారా సమస్యను నివారించుకోవచ్చని తెలిపారు.

పీరియడ్స్‌కు ఐదు రోజుల ముందే జననాంగంలో నొప్పి వస్తుందా?

పీరియడ్స్ వాయిదా కోసం ట్యాబ్లెట్లు వాడితే ప్రెగ్నెన్సీకి ఇబ్బందా?
పీరియడ్స్​ను వాయిదా వేయాలని ట్యాబ్లెట్లు వాడుతుంటారు చాలా మంది మహిళలు. కానీ.. అలా చేయడం మంచిదేనా? భవిష్యత్​లో గర్భం దాల్చడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా?.. ఈ పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details