తెలంగాణ

telangana

Spices For Weight Loss : బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ సుగంధ ద్రవ్యాలను ట్రై చేయండి!

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 8:00 AM IST

Spices For Weight Loss : ప్రస్తుత రోజుల్లో శరీరంలో అధిక కొవ్వు ద్వారా ఏర్పడే బరువుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదంటూ వాపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. అది కూడా మన ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని సుగంధ ద్రవ్యాల ద్వారా ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు. మరి సూపర్​ ఫాస్ట్​గా బరువును తగ్గించే ఆ సుగంధ ద్రవ్యాల సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

Top 10 Indian Spices That Reduce Weight Loss In Telugu
Spices For Weight Loss

Spices For Weight Loss :ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధానమైన సమస్య ఊబకాయం. దీనిని తగ్గించుకునేందుకు చాలా మంది విశ్వప్రయత్నాలు చేసి.. చివరికి నిరాశ చెందుతుంటారు. అయితే ఈ సమస్యకు.. మన వంటింట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలతోనే చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా? వాస్తవానికి మసాలా దినుసులు శరీర జీవక్రియలను మెరుగుపరచి, మనం త్వరగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. మరి ఆ సుగంధ ద్రవ్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

దాల్చిన చెక్క!
Cinnamon :దాల్చిన చెక్క(Cinnamon)లో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్​ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. సహజంగా మనకు వేసే ఆకలిని కంట్రోల్​ చేసే గుణాలు ఈ దాల్చిన చెక్కలో ఉన్నాయి. కనుక శరీర బరువు అనేది క్రమంగా తగ్గుతుంది.

దాల్చిన చెక్క!

కాయెన్ పెప్పర్(మిర్చీ)!
Cayenne Pepper : కాయెన్ పెప్పర్(మిర్చీ)లో ఉండే మండే స్వభావం మీ ఆకలిని తగ్గిస్తుంది. దీనిని మీరు పొడి రూపంలో లేదా కాయ రూపంలో కానీ తీసుకోవచ్చు. దీనిని మీ కడుపు కూడా త్వరగా అరిగించేసుకుంటుంది. ఇది మన శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్​ను కరిగిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటికి అదనంగా ఈ కాయెన్ పెప్పర్​లో ఉండే క్యాప్సైసిన్​లోని థర్మోజెనిక్ లక్షణాలతో మన బాడీలోని ఫ్యాట్​ను సులువుగా కరిగించుకోవచ్చు.

కాయెన్ పెప్పర్(మిర్చి)!

సోంపు గింజలు!
Fennel Seeds :సోంపు గింజల్లో సహజమైన మూత్రవిసర్జన, ఆకలిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. వీటిల్లో ఎ, సి, డి విటమిన్​లు పుష్కలంగా ఉంటాయి. పేగుల ఆరోగ్యానికి మేలు చేసే అనేక యాంటీ ఆక్సిడెంట్​లూ ఇందులో లభిస్తాయి. తద్వారా మీ జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అందువల్ల సోంపు తీసుకుంటే.. మీరు త్వరగా బరువు తగ్గగలుగుతారు.

మెంతి గింజలు!
Fenugreek Seeds : మెంతుల్లో ఉండే ఫైబర్​ అధికంగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. వీటిని తింటే.. మీ పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మెంతి గింజలలో ఉండే మ్యూకిలాజినస్​ అనే ఫైబర్​ పదార్థం మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడి నుంచి జీర్ణాశయానికి ఉపశమనం కలిగిస్తుంది. ఫలితంగా మీ బరువు గణనీయంగా తగ్గుతుంది.

మెంతులు!

ఏలకులు!
Cardamom :ఏలకులు మీ శరీరంలో ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గించి, అధిక నీటిని బయటకు పంపే గుణాలను కలిగి ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఏలకుల్లో బ్యాక్టీరియాతో పోరాడే క్రియాశీల గుణాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిల్లో ఉండే మెలటోనిన్​ అనే యాసిడ్​ సాయంతో మీ శరీరంలోని కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు. మీ శరీరంలో అధిక మోతాదులో ఉన్న నీటిని ఏలకులు మూత్రవిసర్జన రూపంలో బయటకు పంపుతాయి.

నల్ల మిరియాలు!
Black Pepper :నల్ల మిరియాలు కేవలం ఆహారానికి రుచిని అందించడం మాత్రమే కాదు, మీ శరీర బరువును కూడా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పైపెరిన్ అనే రసాయనం మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది.

మసాలా దినుసులతో శరీర బరువును సులువుగా తగ్గించుకోవచ్చు!

వెల్లుల్లి!
Garlic :వెల్లుల్లి మీ శరీరంలోని క్యాలరీలను కరిగించడమే కాకుండా మీరు ఫిట్​గా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఆకలిని తగ్గించే గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మీ జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. మీ గుండె ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది.

పసుపు!
Turmeric : పసుపులో రోగనిరోధక శక్తి గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని ఇమ్యూనిటీ బూస్టర్​గానూ తీసుకోవచ్చు. ఇది మీ బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పసుపులో అధిక కొవ్వును కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ జీవక్రియ వ్యవస్థ పనితీరును ఇది సులభతరం చేస్తుంది. తద్వారా మీరు వేగంగా బరువు తగ్గవచ్చు. ఇందులోని కర్కుమిన్ అనే పదార్థం మీ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.

జీలకర్ర!
Cumin Seeds :మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడంలో జీలకర్ర కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండే లక్షణాలు మీరు తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తాయి. తద్వారా మీ శరీర బరువు తగ్గుదలలో మీరే మార్పులు గమనించవచ్చు. అంతేకాకుండా కఫం, వాత, పిత్తం, వేడిచేయడం లాంటి దోషాలను జీలకర్ర గింజలు నయం చేస్తాయి. మీరు భోజనం చేసిన తర్వాత వేయించిన జీలకర్రను నమలవచ్చు. లేదా కషాయం తయారు చేసుకొని తాగవచ్చు. ఇలా చేస్తే మీరు త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.

ఈ 10 సుగంధ ద్రవ్యాలతో సూపర్​ ఫాస్ట్​గా నాజుగ్గా!

వాము!
Carom Seeds :గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, పొత్తికడుపు నొప్పితో బాధపడేవారు వామును ఔషధంగా తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో ఉబ్బరాన్ని తొలగిస్తుంది. రోజుకు ఒకసారి వాము నీళ్లను తాగడం వలన మీరు సులువుగా బరువు తగ్గవచ్చు. 1 గ్లాస్​ మంచినీటిలో 1/2 టీస్పూన్ వామును వేసి 10 నిమిషాలు మరిగించండి. అవి గోరువెచ్చగా అయ్యాక సన్నిని క్లాత్​తో వడకట్టుకోని తాగవచ్చు.

నోట్​ : మీరు మసాలాలు బాగా దట్టించిన ఆహారాన్ని అధికంగా తీసుకుంటే.. దానికి తగ్గ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల మసాలా దినుసులను మోతాదుకి మించి తినకూడదు. న్యూట్రిషనిస్టులు, డైటిషియన్ల సలహాల మేరకు సుగంధ ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్​ పాటిస్తే చాలు!

Reasons For Regular Stomach Pain : తరచూ కడుపు నొప్పి బాధిస్తోందా? అయితే వీటికి దూరంగా, వాటికి దగ్గరగా ఉండాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details