తెలంగాణ

telangana

Mental Stress Relief Tips Telugu : మానసిక ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ లక్షణాలున్నాయా.. ఐతే ఇలా చేయండి

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 12:22 PM IST

Updated : Aug 24, 2023, 2:00 PM IST

Mental Stress Relief Tips Telugu : గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తుకురావడం.. మీపై మీకు నమ్మకం పోయి.. చచ్చిపోవాలన్న పిచ్చిపిచ్చి ఆలోచనలు రావడం.. వీటికి తోడు నీరసం, అలసట వంటివి మిమ్మల్ని వేధిస్తున్నాయా..? హాఁ.. కొంచెం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి కామన్‌ అనుకుని నిర్లక్ష్యం చేస్తున్నారా..? అలా చేస్తే మీరు ప్రమాదంలో పడ్డట్లే. ఎందుకంటే ఇలాంటి లక్షణాలను మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్థితి (నెర్వస్ బ్రేక్‌డౌన్‌/మెంటల్ బ్రేక్‌డౌన్)గా పేర్కొంటున్నారు నిపుణులు. కరెక్టు టైమ్‌లో దీనిని గుర్తించి.. అవసరమైన చికిత్స తీసుకోకపోతే మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Mental Breakdown Overcome tips
How to Overcome Mental Breakdown in Telugu

Mental Stress Relief Tips Telugu : మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే.. మనమూ అంత ప్రశాంతంగా ఉంటాం. ఏ పనైనా చురుగ్గా చేరుకోగలుగుతాం. అలా కాకుండా మనసంతా గందరగోళంగా ఉంటే.. ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటాం. ఏ పనిపైనా దృష్టి పెట్టలేం. అందుకే ఇలాంటి మానసిక సమస్యను ఆదిలోనే గుర్తించాలని సూచిస్తున్నారు నిపుణులు. లేకపోతే అది క్రమంగా తీవ్రమై.. మెంటల్‌ బ్రేక్‌డౌన్ (మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితి)గా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు.

మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

Mental Breakdown Overcome Tips : మానసికంగా మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిని కొన్ని లక్షణాలతో గుర్తించచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటంటే..?

Ear Infection Symptoms in Telugu : చెవి నొప్పి ఎందుకు వస్తుంది? ఇంటి చిట్కాలు పాటిస్తే ప్రమాదమా?

  • మనపై మనకే నమ్మకం పోవడం.. ఓ దశలో సూసైడ్‌కు సంబంధించిన ఆలోచనలు రావడం
  • ప్రతికూల ఆలోచనలతో రాత్రి సమయాల్లో నిద్ర పట్టకపోవడం..
  • ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.. విపరీతమైన అలసట
  • బీపీ బాగా పెరిగి.. విపరీతమైన కోపం రావడం
  • ఏదైనా విషయం జరగకపోయినా.. జరుగుతుందేమో అని భ్రమపడటం
  • గతంలో జరిగిన భయంకర సంఘటనలు పదేపదే గుర్తుకురావడం
  • ఎక్కువ సమయం ఒంటరిగానే గడపాలనిపించడం
Mental Stress Relief Tips Telugu

Milk With Ghee Benefits : గ్లాసు పాలు+ స్పూన్ నెయ్యి.. కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో.. కీళ్ల నొప్పులు దూరం!

కారణాలు ఏమైనా కావొచ్చు..

తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామంటే.. మన చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తులతో పాటు మరికొన్ని అంశాలూ కారణం కావచ్చని అంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏంటంటే..?

  • నిరంతరాయంగా పనిలో కలిగే ఒత్తిడి
  • బాగా ఇష్టమైన కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం/దూరమవడం
  • ఆర్థిక స్థితి బాగోలేక పదే పదే డబ్బు గురించే మథనపడటం
  • దీర్ఘకాలం పాటు నిద్ర సరిగ్గా లేకపోవడం
  • విశ్రాంతి తీసుకోవడానికీ సమయం దొరక్కపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు
Mental Stress Relief Tips Telugu

ఇలా జయించొచ్చు..!

  • అన్నింటికంటే ముందుగా మీ ఫిజీషియన్ సలహా మేరకు ముందుగా కంప్లీట్‌ బాడీ చెకప్‌ చేయించుకోవాలి.
  • టాక్‌ థెరపీ/కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ.. వంటివి ఉపయోగపడతాయి.
  • డాక్టర్‌ సలహా మేరకు యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ మందులు వాడొచ్చు.
  • యోగా, ధ్యానం చేయడంతో పాటు, మసాజ్‌ చేయించుకోవడం చక్కటి ఫలితాన్నిస్తాయి.
  • తీసుకునే ఆహారంలో కెఫీన్‌ లేకుండా చూసుకోవాలి.
Mental Stress Relief Tips Telugu

Green Tea Health Benefits : గ్రీన్​ టీలో అద్భుత ఔషధ గుణాలు.. క్యాన్సర్​, గుండె జబ్బులకు చెక్​!

ఇక వీటితో పాటు సుఖమైన మంచి నిద్ర, పడుకునేముందు గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, మొబైల్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం, మనసుకు నచ్చిన పనులు చేయడంతో పాటు స్వీయ ప్రేమ కూడా తీవ్ర మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు అవసరం అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ క్రమంలో సమస్యతో బాధపడుతోన్న వారికి కుటుంబసభ్యుల నుంచి తగిన మద్దతు లభించడం కూడా ముఖ్యమేనట! సో.. చూశారు కదండీ.. మీలోనూ పై లక్షణాలున్నా.. లేదా ఉన్నట్లు అనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే ఓ మంచి వైద్యుడిని సంప్రదించండి. అందరిలా హ్యాపీగా జీవించండి.

Kidney Stones Diet : కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? వీటిని తినడం తగ్గించుకోండి.. లేదంటే!

Ayurvedic Medicine For Cold and Fever : దగ్గు, జలుబు వేధిస్తోందా..? సింపుల్ ఆయుర్వేద గోలీ మారో..!

Last Updated : Aug 24, 2023, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details