తెలంగాణ

telangana

ఊరు మారితే పిరియడ్స్ పైన ప్రభావం ఉంటుందా?

By

Published : Mar 3, 2021, 12:27 PM IST

ప్రస్తుత జీవిన విధాన శైలితో చాలా మందిని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అందులో క్రమం తప్పి పిరియడ్స్​ రావటం ఒకటి. ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఇందుకు కారణం కావొచ్చు. నివాసిస్తున్న ప్రాంతాలు ఇందుకో కారణమై ఉండొచ్చు.

ఊరు మారితే పిరియడ్స్ పైన ప్రభావం ఉంటుందా?
ఊరు మారితే పిరియడ్స్ పైన ప్రభావం ఉంటుందా?

ప్ర. హలో డాక్టర్‌. నా వయసు 26. ఎత్తు 5’5’’. బరువు 62 కిలోలు. పెళ్లై రెండు నెలలవుతోంది. మూడేళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్లాను. అప్పట్నుంచి నాకు పిరియడ్స్‌ వచ్చాక రెండు రోజులే బ్లీడింగ్‌ అవుతోంది. ఇదేమైనా సమస్యా? దీనివల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుందా? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: మీ సమస్యకు ప్రదేశంలో మార్పు, అక్కడి వాతావరణంలో మార్పు కొంతవరకు కారణం కావచ్చు. కానీ ఇతరత్రా ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని వివరాలు కావాలి. బరువు పెరిగారా?, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైందా? అన్న విషయాలు కూడా తెలియాలి. ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్‌ టెస్టులు చేయించుకుంటే హార్మోన్ల అసమతుల్యత ఉందేమో అర్థమవుతుంది. ఒకవేళ రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉంటే గర్భం రావడానికి ఇది సమస్య కాదు.

ABOUT THE AUTHOR

...view details