తెలంగాణ

telangana

ఈ పండ్ల రసాలు బరువును తగ్గించేస్తాయ్​!

By

Published : Jun 28, 2021, 11:29 AM IST

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒబేసిటీ(బరువు పెరగటం) ఒకటి. మరి రోజురోజుకు లావైపోతున్నామని బాధ పడుతున్నారా? అయితే.. ఓ వైపు బరువును అదుపులో ఉంచుతూనే.. మరో వైపు పోషకాలు అందించే పండ్ల రసాలను తీసుకుంటే మేలు. అవెంటో చూద్దాం.

eating natural fruits and vegitables
పండ్ల రసాలు

నోరు కట్టేసుకోవడం, విపరీతమైన శారీరక శ్రమ.. బరువు తగ్గాలనుకునేవారు ఎంచుకునే మార్గాలివి. ఇలాచేస్తే శరీరానికి తగిన పోషకాలెలా అందుతాయి? బరువు అదుపులో ఉంచుతూనే పోషకాలు అందించే జ్యూసులివి.

  • ఉసిరి: బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు పరగడుపున రోజూ తీసుకోవాలి. తేనె చేర్చుకుంటే రోజంతా ఉత్సాహంగానూ ఉండొచ్చు.
  • దానిమ్మ: కొవ్వును కరిగించే, మెటబాలిజాన్ని పెంచే గుణాలెక్కువ. శరీర ఛాయని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించుకోవడంలో సాయపడుతుంది.
  • క్యాబేజ్‌: కడుపుబ్బరం, అజీర్ణం వంటి ఉదర సమస్యలకు చెక్‌ పెడుతుంది. జీర్ణక్రియను వేగిరం చేయడమే కాదు, బరువు తగ్గేలా చూస్తుంది.
  • ఆరెంజ్‌: కెలొరీలకు శత్రువని దీనికి పేరు. తక్కువ కెలొరీలుండడమే

ABOUT THE AUTHOR

...view details