తెలంగాణ

telangana

యాదాద్రీశున్ని దర్శించుకున్న గవర్నర్​.. ప్రోటోకాల్​ పాటించని ఈవో..

By

Published : Apr 2, 2022, 6:24 PM IST

Governor Yadadri Visit: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్​ తమిళిసై.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అయితే.. గవర్నర్​ యాదాద్రి పర్యటనలో ఈవో గీతారెడ్డి హాజరుకాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Governor tamilisai visited yadadri temple and eo geetha reddy not attended in governor visit program
స్వామివారిని దర్శించుకుంటున్న గవర్నర్​ దంపతులు..

యాదాద్రీశున్ని దర్శించుకున్న గవర్నర్​.. ప్రోటోకాల్​ పాటించని ఈవో..

Governor Yadadri Visit: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పునర్​నిర్మాణం అనంతరం మొదటిసారిగా గవర్నర్ తమిళ్​సై సౌందర్య రాజన్ దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన గవర్నర్​కు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని గవర్నర్​ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు గవర్నర్​ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. సంప్రదాయం ప్రకారం గవర్నర్​కు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని.. ఆలయ వంశపారంపర్యం ఛైర్మన్​ బి.నరసింహ మూర్తి అందించారు. అనంతరం ఆలయమంతా కలియతిరిగి.. అద్భుతమైన కళాత్మక నిర్మాణాన్ని తమిళిసై పరిశీలించారు. సువర్ణశోభితమైన ఆలయ మండపంలో ఫొటోలు తీసుకున్నారు.

పూర్ణకుంభ స్వాగతం పలుకుతోన్న అర్చకులు
గవర్నర్​ దంపతులకు వేద ఆశీర్వచనం ఇస్తున్న అర్చకులు..

"ఉగాది పర్వదినాన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. యాదాద్రి దేవాలయాన్ని తెలుగు సంవత్సరాదిన దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న తెలుగు, కన్నడ ప్రజలందరికి శుభాకాంక్షలు. ప్రజలందరికి.. వాళ్లు కోరుకున్నవన్ని నిర్విగ్నంగా జరగాలని.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నా." - గవర్నర్​ తమిళిసై..

ఆలయ మండపంలో ఫొటోలు తీసుకున్న గవర్నర్​ దంపతులు
గవర్నర్​కు లడ్డూ ప్రసాదం అందిస్తోన్న ఆలయ ఛైర్మన్​

అయితే.. గవర్నర్ యాదాద్రి పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరయ్యారు. ఈవో లేకపోవడంతో గవర్నర్​కు ఆలయ ఛైర్మన్ నరసింహమూర్తే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్​కు స్వాగతం పలకాల్సిన ఈవో గీతారెడ్డి గైర్హాజరు కావటంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఆలయ వీధుల్లో కలియ తిరుగుతూ భక్తులకు అభివాదం..
వేద ఆశీర్వచనం తీసుకుంటున్న గవర్నర్​ దంపతులు..

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details