తెలంగాణ

telangana

'అన్నదమ్ములిద్దరూ ప్రజల్ని ఆగం చేస్తున్నరు'

By

Published : Apr 5, 2019, 1:02 PM IST

Updated : Apr 5, 2019, 2:32 PM IST

భువనగిరి లోక్​సభ నియోజకవర్గం మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో తెరాస నేతలు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి బూర నర్సయ్య గౌడ్​ను గెలిపించాలని కోరారు.

'అన్నదమ్ములిద్దరూ ప్రజల్ని ఆగం చేస్తున్నరు'

భువనగిరి తెరాస ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తరఫున మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజల్ని ఆగం చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా వారి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు ప్రభాకర్ రెడ్డి. ఊరూరా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి బూర నర్సయ్య గౌడ్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

'అన్నదమ్ములిద్దరూ ప్రజల్ని ఆగం చేస్తున్నరు'
Intro:TG_NLG_111_05_TRS_MP_Ennikalapracharam_Av_C16


తెరాస ఎన్నికల ప్రచారం.
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మునుగోడు మండలం లోని ఇప్పర్తి,కిష్టాపురం,పలివేల,కోతులారం గ్రామాల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ


Body:మునుగోడు నియోజకవర్గం


Conclusion:పరమేష్ బొల్లం
9966816056
Last Updated : Apr 5, 2019, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details