తెలంగాణ

telangana

మునుగోడు ప్రచారంలో జోరు పెంచేందుకు సిద్ధమైన హస్తం నేతలు

By

Published : Oct 18, 2022, 8:08 AM IST

Congress on Munugode Bypoll: అధ్యక్ష ఎన్నికలు ముగియడంతో మునుగోడులో ప్రచారజోరు పెంచేందుకు కాంగ్రెస్‌ నాయకులు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి 22 వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. మునుగోడు ఇంఛార్జ్​లుగా ఉన్న కొందరు నాయకులను జోడో యాత్ర కోసం కేటాయించగా.. మిగిలినవారంతా ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నం కానున్నారు.

Congress on Munugode Bypoll
Congress on Munugode Bypoll

మునుగోడు ప్రచారంలో జోరు పెంచేందుకు సిద్ధమైన హస్తం నేతలు

Congress on Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్‌ ప్రచారానికి రెండు రోజులు తెరపడగా తిరిగి జోరందుకోనుంది. భారత్‌ జోడో యాత్ర, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలుడడం వల్ల ఉప ఎన్నికల ప్రచారం కొంత నెమ్మదించింది. ఇంఛార్జ్​లుగా నియమించిన కొందరు నాయకులు చుట్టం చూపులా వచ్చి వెళ్తుండడంతో ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో ప్రచారంపై తీవ్రంగా పడింది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడంతో తిరిగి మునుగోడు ప్రచారంపై నేతలంతా దృష్టి సారించారు.

నేటి నుంచి సీనియర్‌ నేతలతోపాటు అన్ని స్థాయిల నాయకులు ప్రచారంలో నిమగ్నం కానున్నారు. సంస్థాన్‌ నారాయణపురంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇవాళ చౌటుప్పల్‌ మండలం రేపు మునుగోడు, ఎల్లుండి మర్రిగూడలో ప్రచారం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు మునుగోడు మండలం కొంపల్లిలోనే ఉంటూ ప్రచారంలో పాల్గొనున్నారు. తెరాస, భాజపానే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

చౌటుప్పల్‌ మండలంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంభం అనిల్​కుమార్‌ రెడ్డి, రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం సక్రమంగా జరిగేటట్లు చూడనున్నారు. మునుగోడు మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రేమసాగర్‌రావు, విజయరామారావు ప్రచారంలో పాల్గొననున్నారు. చండూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కు్మార్‌, డాక్టర్‌ వంశీకృష్ణరెడ్డి, మల్‌రెడ్డి రామిరెడ్డి.. స్థానిక నాయకులు, బూత్‌ స్థాయి సమన్వయ కర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తారు.

నాంపల్లిలో ఎమ్మెల్యే సీతక్క ప్రచారంలో పాల్గొంటారు. మర్రిగూడ మండలంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్‌ నేత వేంనరేందర్‌ రెడ్డి, పటేల్‌ రమేశ్​రెడ్డి ఇంటింటికి వెళ్లనున్నారు. గట్టుప్పల్‌ మండలంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ప్రచారం చేయనున్నారు. ఈనెల 23న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. అప్పటివరకు మునుగోడులోనే ఉండి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

"మునుగోడును బంగారు తెలంగాణ చేయలేదు. రోడ్లన్ని గుంతలమయంగా మారాయి. బంగారు తెలంగాణలో మునుగోడు లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు దత్తత అనే విషయం గుర్తుకు వచ్చిందా. ఎవరని మభ్య పెడుతున్నారు. ముక్కుసూటిగా ఈటల రాజేందర్, రఘనందన్​రావుకి ఇదే నా సవాల్. మీరు దిల్లీలో మోదీ నుంచి తెచ్చిన నిధులు ఏమిటో చెప్పి ఇక్కడ ఓట్లు అడగండి." -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details