తెలంగాణ

telangana

CM KCR Yadadri Tour Speech: దేశం తిరోగమిస్తున్నా... తెలంగాణ పురోగమిస్తోంది: సీఎం కేసీఆర్​

By

Published : Feb 12, 2022, 3:48 PM IST

Updated : Feb 12, 2022, 4:26 PM IST

CM KCR Yadadri Tour Speech: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్​ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, వరంగల్‌ అద్భుతమైన కారిడార్‌గా అభివృద్ధి చెందుతాయని అన్నారు.

CM KCR Yadadri Tour Speech
CM KCR Yadadri Tour Speech

భువనగిరిలో సీఎం కేసీఆర్ ప్రసంగం

CM KCR Yadadri Tour Speech: భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదన్నారు. ఉమ్మడి ఏపీలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదని వెల్లడించారు. ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, వరంగల్‌ అద్భుతమైన కారిడార్‌గా అభివృద్ధి చెందుతాయని వివరించారు.

CM KCR on Bhongir Development: భువనగిరిలో ఇప్పుడు రూ.2-3 కోట్ల వరకు భూముల విలువలు ఉన్నాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోనూ రూ.20 లక్షలకు పైనే భూముల ధరలు ఉన్నాయని చెప్పారు. అధికారుల అద్భుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయన్నారు. మిషన్‌ భగీరథతో భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖ కృషితో నిరంతర విద్యుత్‌ వస్తోందని ఉద్ఘాటించారు.

KCR talk about govt employees:

కేబినెట్‌ భేటీని సుదీర్ఘంగా జరిపి.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం. అధికారుల కృషితో విద్యుత్‌, మంచినీళ్లు, హరితహారం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. తెలంగాణలో ఉద్యోగులకు మరింతగా జీతాలు పెరుగుతాయి. ఇంకో గంట ఎక్కువ పనిచేసైనా సరే అభివృద్ధి సాధించి ఫలితం పొందుతాం. గుంట, అరఎకరం ఉన్న రైతు చనిపోయినా.. 8 రోజుల్లోనే బీమా డబ్బులు వస్తాయి.

---- ముఖ్యమంత్రి కేసీఆర్​

CM KCR on Dalit Bandhu: దళితబంధుపై కొందరు తెలిసీతెలియక మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. ఏ వర్గాన్నీ వదలకుండా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామని వెల్లడించారు. మహాత్ముల పేర్ల మీద పేద విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ సుస్థిరతతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

ఉద్యోగులకు పైరసీల కోసం తిరిగే దుస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ సరళీకరిస్తే పైరవీల బాధ తప్పుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ రోజు వారికి రావాల్సిన మొత్తాన్ని ప్యాకేజీగా అందించాలని చెప్పారు. పదవీవిరమణ చేశాక ఉద్యోగులను ప్రభుత్వ వాహనంలోనే వారి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. హైదరాబాద్‌లో ఒక విల్లా ధర ఇవాళ రూ.25-30 కోట్లు పలుకుతోందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

KCR talk about electricity: దేశంలోనే గొర్రెలు పెంపెకంలో అగ్ర రాష్ట్రంగా నిలిచాం. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే అభివృద్ధి సాధిస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రమైతే తెలంగాణకు కరెంటు రాదని అవహేళన చేశారు. ఒక సీఎం అయితే కట్టే పట్టుకుని మ్యాప్​లో చూయించారు. ఇవాళ వారి రాష్ట్రంలోనే అంధకారం కనిపిస్తోంది.

---- ముఖ్యమంత్రి కేసీఆర్​

రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని.. అవకాశం రావాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులు అనేక పెద్ద ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. యాదాద్రి కలెక్టరేట్​ ఆర్కిటెక్ట్​ ఉషను ఈ సందర్భంగా అభినందించారు.

ఇదీ చూడండి: CM Kcr‌ Launched Presidential Suites: ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభించిన కేసీఆర్‌

Last Updated : Feb 12, 2022, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details