తెలంగాణ

telangana

ఈ నెల 31 నుంచి యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

By

Published : Jan 11, 2023, 9:18 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో అధికారులతో సమావేశం నిర్వహించారు. 31 నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలతో వార్షిక ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

Brahmotsavam will be held in Yadadri
యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మో త్సవాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్నాయి. ముందుగా ఈ నెల 27 నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి యాదగిరిగుట్ట ఆలయ ఈవో కార్యాలయంలోో సోమవారం అధికారులు, అర్చకులతో ఈవో గీతారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 6 వరకు 11 రోజుల పాటు ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. ఈ నెల 31న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6న నిర్వహించే శతఘటాభి షేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తం కానున్నాయి.

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి

ABOUT THE AUTHOR

...view details