తెలంగాణ

telangana

Bandi Sanjay: 'సీఎం కేసీఆర్​ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు'

By

Published : Jul 18, 2021, 11:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ ఎయిమ్స్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ (bandi sanjay) సందర్శించారు. ఎయిమ్స్​లో ఫోర్సెనిక్ మెడిసిన్, టాక్సీకాలజీ, రేడియోడయాగ్నోసిస్ విభాగాలను ప్రారంభించారు. ఎయిమ్స్​కు అన్నిరకాల సహాయసహకారాలు కేంద్రం నుంచి అందుతున్నాయని తెలిపారు. మరిన్ని సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు.

bandi sanjay
bandi sanjay

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎయిమ్స్ బాడీ మెంబర్ బండి సంజయ్ (bandi sanjay)... బీబీనగర్​ ఎయిమ్స్​ను సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా... బండి సంజయ్​కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం అధికారులు, వైద్యులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

బీబీనగర్​ ఎయిమ్స్​ను సందర్శించిన బండి సంజయ్​

ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ కేఎంసీకి రూ. 130కోట్లు ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. వైద్యం కోసం ఈసారి కేంద్ర బడ్జెట్​లో రూ.2 లక్షల కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఎయిమ్స్​ను అభివృద్ధి చేస్తే కేంద్రానికి పేరు వస్తుందని... అందుకే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

బండి సంజయ్​కు స్వాగతం పలికిన ఎయిమ్స్​ డైరెక్టర్​ వికాస్​ బాటియా

బీబీనగర్​ ఎయిమ్స్​ను.. ఎయిమ్స్​ హైదరాబాద్​గా మార్చే యోచన

పేదలకు ఉచితంగా, అధునాతన వైద్యం అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు బండి సంజయ్. బీబీనగర్​ ఎయిమ్స్​ను ఎయిమ్స్ హైదరాబాద్​గా మార్చాలనే ఆలోచన ఉందని... దాని ద్వారా అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో అన్నిరకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని... భవిష్యత్తులో ఎంఎస్​ కోర్సును ప్రారంభిస్తామని ఎయిమ్స్​ డైరెక్టర్​ భాటియా తెలిపారు. ఎంబీబీఎస్​ మూడో ఏడాది విద్యార్థులకోసం వసతి భవనం లేదని... దానిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే ఎయిమ్స్​లో అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

పేదలకు ఉచితంగా అధునాతన సదుపాయాలతో వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు భాజపా హయాంలో 22 ఎయిమ్స్​ ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారు. ఎయిమ్స్​ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఎయిమ్స్​ను అభివృద్ధి చేస్తుంటే కేంద్రానికి మంచిపేరు వస్తుందని ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. ఎయిమ్స్​ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. బీబీనగర్​ ఎయిమ్స్​ పేరును హైదరాబాద్​ ఎయిమ్స్​గా పేరుమార్చే యోచన ఉంది. త్వరలోనే ఎయిమ్స్​ అందుబాటులోకి తీసుకొస్తాం. ఎయిమ్స్​ కోసం నోడల్​ అధికారిని నియమించాలి. బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో త్వరలో 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు

ABOUT THE AUTHOR

...view details