తెలంగాణ

telangana

BJP Election Campaign in Munugode : మునుగోడు ప్రచారంలో హోరెత్తిస్తున్న భాజపా

By

Published : Oct 31, 2022, 8:06 AM IST

BJP Election Campaign in Munugode: మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం మరో రెండ్రోజుల్లో ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక గెలుస్తామనే ధీమాతో ఉన్న కాషాయదళం.. జాతీయ నాయకత్వం సాయం లేకుండానే విజయం సాధించి.. గెలిచి తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తోంది. మరో ‘ఆర్’ను గెలుచుకుని మోదీ, అమిత్‌ షాకు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

Bjp Election Campaign in Munugodu
మునుగోడు ఉపఎన్నిక

మునుగోడులో భాజపా ప్రచార హోరు

BJP Election Campaign in Munugode: ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న భాజపా ప్రచారానికి మరింత పదును పెట్టింది. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్న శ్రేణులు... తెరాస సర్కారు వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. నేడు మునుగోడులో నిర్వహించాల్సిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ... ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా రద్దు కావడంతో ప్రతి నాయకుడు అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు.

Munugode By Poll Campaign : కనీసం దీపావళికి కూడా ఇంటికి వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వల్ల స్థానికంగా జరిగే అభివృద్ధి, రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే ప్రతి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కాషాయదళం బిజీగా ఉంది. మునుగోడు ఎన్నికలను తెరాస, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభ ఉండి, నడ్డా సభ లేకపోవడం.. భాజపా శ్రేణులను కాస్త నిరాశ పరిచినప్పటికీ.. మరింత ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.

కొద్ది రోజులుగా భాజపా స్టార్ క్యాంపెయినర్లంతా మునుగోడులోనే మకాం వేశారు. ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు గడప గడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ జాబితాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తరుణ్ చుగ్, సునీల్ భన్సల్, అరవింద్ మీనన్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటి నేతలు ప్రచారంలో తలమునకలయ్యారు. భారీ బహిరంగ సభ పెట్టాల్సి వస్తే స్థానిక సమస్యలను ప్రస్తావించేందుకు వీలుండదనే భావనతో మండలాలవారీగా సభలు నిర్వహించాలని కాషాయ దళం నిర్ణయం తీసుకుంది. 7 మండలాల్లో సభలు నిర్వహించనుంది. బైక్ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details