తెలంగాణ

telangana

'కరోనా కేసులు దేశంలో కంటే రాష్ట్రంలో మూడురెట్లు ఎక్కువ'

By

Published : Jul 12, 2020, 4:34 PM IST

దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో మోదీ సర్కారు... పై చేయి సాధించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కొవిడ్‌ నియంత్రణలో కేసీఆర్ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

mp dharmapuri aravind criticized on telangana government
కరోనా కట్టడిలో తెరాస పూర్తిగా విఫలమైంది: ఎంపీ అరవింద్​

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో... ప్రధాని లాక్‌డౌన్ విధించి పలు దేశాలకు ఆదర్శంగా నిలిచారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా సగటున 7.3 శాతం కొవిడ్ కేసులు నమోదవుతుంటే... రాష్ట్రంలో మాత్రం సగటున 21 శాతం కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఐదు నెలల్లో సుమారు 5 వేల కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా వందల కోట్ల రూపాయలను విడుదల చేసిన్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి:భాజపా నేత, ఎంపీ అర్వింద్ కారుపై తెరాస కార్యకర్తల దాడి

ABOUT THE AUTHOR

...view details