తెలంగాణ

telangana

Etela Rajender ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట విషాదం

By

Published : Aug 24, 2022, 10:00 AM IST

Updated : Aug 24, 2022, 11:53 AM IST

Etela Rajender Father Passes Away భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య(104) అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం మృతి చెందారు.

Etela Rajender father passes away
ఈటల మల్లయ్య

Etela Rajender Father Passes Away: భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈటల మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రెండో కుమారుడు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రి-మెడికల్‌ కళాశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. మరణవార్తను ఈటల కుటుంబీకులు ధ్రువీకరించారు. పార్థీవ దేహాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్​లోని స్వగృహంకు తరలించారు. పలువురు నాయకులు మల్లయ్య పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నాం అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Last Updated :Aug 24, 2022, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details