తెలంగాణ

telangana

మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Jun 21, 2021, 1:08 PM IST

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సెంట్రల్‌ జైలు స్థలాన్ని లీజుకు ఇస్తారంటూ.. కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని దేశంలోనే పెద్ద దావఖానాగా తీర్చిదిద్దాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచనని తెలిపారు.

Minister Errabelli responds to a new hospital to be built in Warangal
వరంగల్‌లో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌లో నూతనంగా నిర్మంచబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని దేశంలోనే పెద్ద దావఖానాగా తీర్చిదిద్దాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచనని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సెంట్రల్ జైలు స్ధలాన్ని ప్రభుత్వం లీజుకిస్తోందంటూ.. కొందరు చేస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా నిర్మించబోయే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నూతన జైలు నిర్మాణం కోసం వరంగల్‌లోని మామూనూర్ దగ్గర గల 101 ఎకరాల స్థలంలో త్వరలోనే భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగోట్టుకుంటున్న వాహనదారులు

ABOUT THE AUTHOR

...view details