తెలంగాణ

telangana

Lockdown: హన్మకొండలో ప్రశాంతంగా లాక్ డౌన్

By

Published : May 30, 2021, 3:21 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్ డౌన్ (Lockdown) ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

lockdown
lockdown

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్ డౌన్ (Lockdown) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పది గంటల నుంచి నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేక రహదారులు వెలవెలబోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు లాక్ డౌన్ పట్ల కఠినంగా ఉండటంతో ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. ఉదయం పది గంటల లోపే ప్రజలు బయటకు వచ్చి నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకుని వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details