తెలంగాణ

telangana

సర్వింగ్‌ బౌల్‌ గణేష్... వరంగల్ యువకుడి ప్రతిభ

By

Published : Sep 6, 2022, 5:16 PM IST

GANESH IDOL

వరంగల్‌ నగరంలో విభిన్న ఆకృతుల్లో గణపతుల ప్రతిమలు కొలువుదీరి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయకచవితి ఉత్సవాల్లో భక్తులు గణేశుడికి ప్రసాదంగా లడ్డూ అందించడం ఆనవాయితీ. కానీ వినాయకుడి దర్శనానికి వచ్చే భక్తులకు సర్వింగ్‌ యంత్రం ద్వారా గణేశ్ లడ్డునూ ప్రసాదంగా ఇస్తూ భక్తులను తన్మయులను చేస్తున్నాడు. భక్తులను ఆకట్టుకునేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . ఈ గణపతి మండపాలను చూసేందుకు వచ్చే భక్తులు, ప్రసాదం పంపిణీ, గంట కొట్టడం వంటి విన్నూత పరికరాలను యువకులు తయారు చేశారు.

వినాయక చవితి వచ్చిందంటేచాలు వరంగల్ నగరం లోని కాలనీలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకుంటుంది. తొమ్మిది రోజుల పాటు విభిన్న ఆకృతులతో కొలువుదీరిన గణనాధులు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. గతానికి భిన్నంగా మండపాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ అనంతరం పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజలను అందజేస్తున్నారు. దేశాయిపేటలోని కళ్యాణి నగర్ కు చెందిన హర్షిత్ అనే విద్యార్థి సెన్సార్ తో తయారు చేసిన గంటను గణపతి మండపంలో ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు శ్రమించి గంటను తాకకుండానే గంట మోగే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. అంతే కాకుండా బొజ్జ గణపయ్యకు నిత్యం అభిషేకం జరిగే విధంగా చిన్నపాటి మోటార్ తో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసిన హర్షిత్ అంతటితో ఆగకుండా ప్రసాదాన్ని భక్తుల చెంతకు చేర్చే విధంగా సర్వింగ్ యంత్రాన్ని తయారు చేశాడు. హర్షిత్ తయారు చేసిన వివిధ యంత్రాలను చూసి కాలనీవాసులు హర్షిత్‌కు అభినందనలు తెలిపారు.

GANESH IDOL

గణపతి నవరాత్రి ఉత్సవాలు విద్యార్థులు తయారుచేసిన సెన్సార్ బెల్ ప్రత్యేకంగా నిలిచింది. సర్వింగ్ బౌల్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంది. విద్యార్థుల ప్రతిభను చూసి మండపనికి వచ్చిన భక్తులు విద్యార్థులను అభినందిస్తున్నారు మరిన్ని సరికొత్త యంత్రాల రూపొందించాలని వెన్నతట్టి ప్రొత్సహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details