తెలంగాణ

telangana

'కేసీఆర్​ పూటకో మాట మాట్లాడుతూ మోసం చేస్తున్నారు'

By

Published : Feb 21, 2021, 1:44 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాటమాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. హన్మకొండలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

'కేసీఆర్​ పూటకో మాట మాట్లాడుతూ మోసం చేస్తున్నారు'
'కేసీఆర్​ పూటకో మాట మాట్లాడుతూ మోసం చేస్తున్నారు'

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్​లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోందని... ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాటమాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వ్యాఖ్యానించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడుతానని చెప్పారు.

ఇదీ చూడండి:వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు

ABOUT THE AUTHOR

...view details