తెలంగాణ

telangana

పోలీసుల లాఠీ ఛార్జీతో ఉద్రిక్తతగా ఏబీవీపీ ఆందోళన

By

Published : Oct 12, 2020, 3:57 PM IST

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

abvp protests for ebc reservations in warangal urban district
పోలీసుల లాఠీ ఛార్జీతో ఉద్రిక్తతగా ఏబీవీపీ ఆందోళన

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం అమల్లోకి తెచ్చిన అగ్రవర్ణ కులాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు.

వారిని పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల జులుం నశించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

పోలీసుల లాఠీ ఛార్జీతో ఉద్రిక్తతగా ఏబీవీపీ ఆందోళన

ఇదీ చదవండి:నాంపల్లి కోర్టుకు.. రేవంత్​ రెడ్డి సహా పలువురు నేతలు

ABOUT THE AUTHOR

...view details