తెలంగాణ

telangana

Family Donated Brain Dead Daughter Organs : ఆ బాలిక చనిపోతూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 10:42 PM IST

Family Donated Brain Dead Daughter Organs : బాగా చదువుతుంది. ఆట పాటల్లోనూ మేటిగా నిలుస్తుంది. కన్న కుమార్తెను చూసి సంతోషపడుతున్న ఆ తల్లిదండ్రులపై విధి పగ తీర్చుకుంది. అనుకోని ప్రమాదంలో పాప తనువు చాలించింది. కానీ తాను చనిపోతూ మరో ఏడుగురికి అవయవ దానం చేసి.. ఆ బాలిక ధన్యజీవి అయింది.

Organ donation of a girl in Hanamakonda
Organ donation

Family Donated Brain Dead Daughter Organs in Hanamkonda:కడుపున పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారై సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ తమ కళ్లముందే వారు కన్నుమూస్తే ఆ బాధను ఎవ్వరూ భరించలేరు. హనుమకొండ యాదవనగర్‌లో నివసిస్తున్న శంకర్, స్వప్న దంపతులకు పెద్ద కుమార్తె అక్షయ.. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఇంటి బాల్కనీ నుంచి పొరపాటున జారి కిందపడింది. దీంతో బాలిక తలకు బలమైన గాయమైంది.

Organ Donation in Hanamkonda : తొలుత అక్షయను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. మరోవైపు వైద్యుల సలహా మేరకు.. పాప అవయవాలను దానం (Donated Organs) చేయడానికి ముందుకొచ్చి ఈ తల్లిదండ్రులు తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. మృత్యుముఖంలోనూ మరో ఏడుగురికి పునర్జన్మ ఇచ్చి.. వారి జీవితాల్లో వెలుగులు పంచి.. ఈ చిన్నారి చిరంజీవిగా నిలిచింది.

'మరణిస్తూ.. మరొకరికి ఆయువుపోసే అవకాశం అందరికీ రాదు'

కానీ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు మాత్రం ఈ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. నిన్నటివరకూ తమ కళ్ల ముందున్న బిడ్డ.. ఇవాళ లేదన్న విషయాన్ని జీర్ణించుకులేక కంటతడిపెడుతున్నారు.

"పాప పాఠశాలకు వెళ్లి వచ్చింది. కాసేపటికి బాల్కనీ నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించాం. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించాం. అక్కడ వారు బ్రెయిన్‌డెడ్‌ అయిందని చెప్పారు. దీంతో పాప అవయవాలను దానం చేయమని వైద్యులు సూచించారు. వారి సూచన మేరకు పాప అవయవాలను దానం చేశాం." - శంకర్, పాప తండ్రి

"పాప బ్రెయిన్‌డెడ్ అయిందని చెప్పారు. నా కూతురి అవయవాలను దానం చేయమని చెప్పారు. దీంతో సరేనని అంగీకరించాం. మా పాప చనిపోతూ కూడా మరో ఏడుగురికి పునర్జన్మ ఇచ్చింది." - స్వప్న, పాప తల్లి

Young Doctor Organ Donation :ఇటీవలే ఓ యువవైద్యుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవన్మృతుడిగా మారాడు.. కుటుంబసభ్యులు అతని అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన అతని కోరిక నెరవేర్చారు. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన చిన్ని నిఖిల్‌ బెంగళూరులో బీఏఎంఎస్‌ చదివి. అక్కడే ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 29న బెంగళూరు నుంచి ఏపీలోని కావలికి కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

Organ donation Telangana 2021 : ప్రాణదాతగా జీవన్ దాన్.. ఎనిమిదేళ్లలో ఈసారి రికార్డు!

ఈ ఘటనలో నిఖిల్‌ తలకు బలమైన గాయమైంది. అతనిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మే 1న బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు.. వైద్యులు నిఖిల్ తల్లిదండ్రులు చిన్ని రమేశ్‌, భారతికి తెలిపారు. కుమారుడి కోరిక మేరకు అవయవదానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో ప్రత్యేకంగా అంబులెన్స్‌ ఏర్పాటు చేసి నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు.

తనువు చాలించి.. ఏడుగురికి ప్రాణదాతగా నిలిచిన స్టేజ్​ ఆర్టిస్ట్

మహిళ అవయవదానం.. 15 సంవత్సరాల బాలుడి జీవితంలో వెలుగులు

ABOUT THE AUTHOR

...view details