తెలంగాణ

telangana

'హైదరాబాద్​లో దమ్​ బిర్యానీ తిని వెళ్లడమే తప్ప.. వాళ్లు గెలిచేది లేదు'

By

Published : May 7, 2022, 1:31 PM IST

Updated : May 7, 2022, 1:51 PM IST

KTR in warangal Tour
కైటెక్స్ టెక్స్‌టైల్ పార్కు ప్రారంభోత్సంలో మంత్రి కేటీఆర్‌

KTR at kitex texttile park: వరంగల్‌లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్‌ లాంటి పార్కు ఏర్పాటు చేయాలని.. ప్రధాని మోదీకి కూడా ఆలోచన రాలేదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో అవార్డు రాని డిపార్టుమెంట్‌ లేదని అన్నారు. అన్ని రంగాల్లో ముందుకువెళ్తున్న తెలంగాణకు మరో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పొలిటికల్‌ టూరిస్టులు వస్తనే ఉంటారు.. పోతనే ఉంటారంటూ.. ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.

KTR at kitex texttile park:రాష్ట్రానికి పొలిటికల్‌ టూరిస్టులు వస్తూ.. పోతూ ఉంటారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో దమ్‌ బిర్యానీ తిని వెళ్లడమే తప్ప.. వారు గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేసిన కీలక కంపెనీల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేశారని కేటీఆర్‌ వెల్లడించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో కైటెక్స్ టెక్స్ టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించారు. రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యిందని తెలిపారు.

'హైదరాబాద్​లో దమ్​ బిర్యానీ తిని వెళ్లడమే తప్ప.. వాళ్లు గెలిచేది లేదు'

దాదాపు రూ.12 వేల కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో కైటెక్స్ వస్త్ర పరిశ్రమ యూనిట్​ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 12 వేల మందికి ఉపాధి లభించనుంది ఇందులో 8వేల మంది వరకు మహిళలకే అవకాశం ఇవ్వనున్నారు. కైటెక్స్ మెగా జౌళి పార్కుకు 100 కోట్ల రూపాయల వ్యయంతో చలివాగు నుంచి నీరు అందించే మిషన్ భగీరథ పైపులైను, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

గణేశ్​ ఎకోపెట్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలోనూ మంత్రి పాల్గొన్నారు. కాకతీయ మెగా జౌళి పార్కులో 400 కోట్ల రూపాయలతో గణేశ్​ ఎకో పెట్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 700 మంది ఉపాధి పొందనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ కేటీఆర్ సమక్షంలో తమ పరిశ్రమకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణలో పండే పత్తికి.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్కు ద్వారా 30 వేల మందికి ప్రత్యక్షంగా 20 వేల నుంచి 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని మంత్రి వెల్లడించారు.

KTR About BJP & Congress :

ఇవీ చూడండి:Harish Tweet On Rahul : 'ఆ ఒక్క ప్రశ్నతో రాహుల్ గాంధీ సంగతేంటో అర్థమైంది'

బీచ్​లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి.. అసలేం జరిగింది?

Last Updated :May 7, 2022, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details