తెలంగాణ

telangana

సహకార సంఘాల సేవలు భేష్​: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Aug 15, 2020, 7:57 PM IST

సహకార బ్యాంకుల సహాయంతోనే పేదప్రజలు ప్రగతి సాధిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో జరిగిన ఎస్​హెచ్​జీ రుణాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రమేశ్​తో కలిసి మంత్రి పాల్గొన్నారు.

సహకార సంఘాల సేవలు భేష్​: మంత్రి ఎర్రబెల్లి
సహకార సంఘాల సేవలు భేష్​: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపేటలో జరిగిన ఎస్​హెచ్​జీ రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాల్గొన్నారు. గ్రామంలో 10 మహిళా గ్రూపులకు ఒక్కో సంఘానికి 5లక్షల రూపాయల చొప్పున 50 లక్షల రూపాయల చెక్కులను పంపిణి చేశారు.

లబ్ధిదారులు పొందిన మొత్తంతో ఆర్థిక ప్రగతి సాధించాలని మహిళలకు సూచించారు. మహిళల సాధికారతకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ ఆరా

ABOUT THE AUTHOR

...view details