తెలంగాణ

telangana

బండరాయితో తలపై మోది హత్య

By

Published : Jun 21, 2020, 3:59 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం లాల్ తండాలో ఓ వ్యక్తిని ఉరేసి బండరాయితో తలపై కొట్టి చంపేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man Suspect death at Lal thanda in Warangal rural district
బండరాయితో తలపై మోది వ్యక్తి దారుణ హత్య

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం లాల్ తండాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఉరేసి బండరాయితో తలపై కొట్టిన ఆనవాళ్లను గమనించినట్లు పేర్కొన్నారు.

ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుడు బాధవత్ వేరుగా పోలీసులు గుర్తించారు. నిందితులను తర్వగా పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details