తెలంగాణ

telangana

Silkworm Rearing: పట్టు పురుగుల పెంపకం.. స్వయం ఉపాధితో ఆదర్శం

By

Published : Mar 30, 2022, 1:14 AM IST

Silkworm
Silkworm ()

Silkworm Rearing: ఉద్యోగం కోసం యువత పడే పాట్లు అన్ని ఇన్ని కావు. తక్కువ జీతమైనా చాలు ఉద్యోగం ఉంటే చాలు అనుకుంటారు. కాని దీనికి విభిన్నంగా ఆలోచించారు వనపర్తి జిల్లా యువకులు. తమకున్న కొద్దిపాటి భూమిలో పట్టుపురుగుల పెంపకం చేస్తూ వేలల్లో సంపాదిస్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు.

యువకుల పట్టు పురుగుల పెంపకం.. స్వయం ఉపాధితో ఆదర్శం

Silkworm Rearing: ఆలోచనే ఉండాలి గాని ఆదాయానికి కొదవలేదంటారు.. సరిగ్గా ఈ మాటనే నిజం చేస్తున్నారు వనపర్తి జిల్లా రాజనగరానికి చెందిన నవీన్, రియాజ్ అనే యువకులు. డిప్లామా చదివిన నవీన్ ఉద్యోగాల కోసం ప్రయత్నించి విసుగుచెందాడు. తన తండ్రి రైతు కావడంతో ఏవైనా కొత్తరకం పంటలు పండించాలనుకున్నాడు. ఈక్రమంలోనే తన మిత్రుడు రియాజ్​తో కలిసి పట్టుపురుగుల పెంపకం ప్రారంభించాలనుకున్నారు. జిల్లా శాఖలోని పట్టుపరిశ్రమ అధికారులను సంప్రదించారు. వారు వీరిని ప్రోత్సహించి షెడ్డు నిర్మాణానికి రెండు లక్షల రుణం మంజూరు చేశారు. అదే విధంగా దీనికి ప్రధానమైన మలబరీ తోట పెంపకాన్ని దగ్గరుండి సాగు చేయించారు.

అనంతపురం నుంచి పట్టుపురుగులను తెచ్చి అధికారుల సూచన మేరకు వాటిని పెంచుతూ కేవలం నెలరోజుల వ్యవధిలోనే 50వేల ఆదాయం సంపాదించారు. గత రెండేళ్లుగా ఏడాదికి ఐదు పంటల పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. కేవలం ఉద్యోగం కోసమే వెంపర్లాడే యువత ఉన్న ఈ రోజుల్లో పట్టు పెంపకం చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి:Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్‌ ట్వీట్‌.. కవిత కౌంటర్‌

ABOUT THE AUTHOR

...view details