తెలంగాణ

telangana

'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

By

Published : Jun 11, 2019, 7:15 PM IST

Updated : Jun 11, 2019, 9:52 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో సర్కార్ దవాఖానా ఓ పసి బాలుడిని పొట్టన పెట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్తే సమయానికి డాక్టర్ లేడు. జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్దామంటే అంబులెన్స్​లో డీజిల్ లేదు. ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లినా ప్రాణం మాత్రం దక్కలేదు.

'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

వనపర్తికి చెందిన రాజు రిక్షా కార్మికుడు. తన ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా పెంచుతున్నాడు. ప్రమాదవశాత్తు తన 14 ఏళ్ల కుమారుడు మంచం మీద నుంచి పడి స్పృహ కోల్పోయాడు. వెంటనే స్థానికి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యుడు లేడు. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లమని సిబ్బంది సూచించారు. అంబులెన్స్ కోసం వెళ్తే పెట్రోల్ లేక గత 15 రోజులుగా మూలనపడింది. గత్యంతరం లేక ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ... అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. 10 నిమిషాలు ముందు తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని చెప్పటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవటం, సమాయానికి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు, పట్టణవాసులు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. కొత్తకోట ఎస్​ఐ, ఎమ్మార్వో, ఇంఛార్జీ డీఎంలు సంఘటనా స్థలానికి వచ్చి ఆస్పత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి విచారణ జరిపి కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తామని తెలియజేశారు.

తమ కొడుకుకి జరిగినట్లుగా ఇంకెవ్వరికీ జరగకూడదని, ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు కల్పించాలని, మరో ఇద్దరు వైద్యులను నియమించాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: తండ్రి ట్రాక్టర్​ కింద పడి చిన్నారి మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Jun 11, 2019, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details