తెలంగాణ

telangana

'నాగరాజు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం.. మూడెకరాల భూమి'

By

Published : May 7, 2022, 2:12 PM IST

Updated : May 7, 2022, 3:46 PM IST

Honro Killing Victim Family : సరూర్​నగర్​లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్​ విజయ్ సాప్లా పరామర్శించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయిస్తామని ఆయన హమీ ఇచ్చారు. రూ.8.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Vijay sapla at Marpally
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు విజయ్ సాప్లా

Vijay sapla at Marpally: పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేసు విచారణ వేగవంతంగా జరిగేందుకు కృషి చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్​ విజయ్ సాప్లా హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కేసును ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని తెలిపారు.

"నాగరాజు కుటుంబానికి రూ 8.50 లక్షల సాయం ఆర్థికసాయం అందిస్తున్నాం. తక్షణమే వారికి యాభైశాతం అందజేస్తాం. వారికి మూడెకరాల భూమి కేటాయిస్తాం. అలాగే రెండు పడక గదులు ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం. నాగరాజు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం." - విజయ్ సాప్లా, జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్​

నాగరాజు కుటుంబానికి రూ.8.50 లక్షల సాయం అందిస్తున్నట్లు విజయ్ సాప్లా వెల్లడించారు. తక్షణమే వారి కుటుంబానికి రూ.4 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగరాజు భార్య సయ్యద్‌ ఆశ్రిన్‌ సుల్తానాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తామని విజయ్ సాప్లా పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ప్రేమ వివాహాన్ని భరించలేకే సరూర్‌నగర్‌ హత్య: ఎల్బీనగర్ డీసీపీ

Last Updated : May 7, 2022, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details