తెలంగాణ

telangana

'రైతుల కోసం ఆరాటపడే వ్యక్తి సీఎం కేసీఆర్'

By

Published : Feb 17, 2021, 6:53 PM IST

కుల్కచర్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

CM KCRs birthday celebrations were held at the Kulkacharla Mandal Center
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం

రైతులకు మేలు చేయాలనే సహకార సంఘం బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటించామని పేర్కొన్నారు.

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డితో కలిసి మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. రుణాలు తీసుకున్న రైతు సకాలంలో చెల్లించాలని కోరారు.

ఆరాటపడే వ్యక్తి..

డీసీసీబీ శాఖలు మరో నాలుగు కొత్తవి రానున్నాయని తెలిపారు. రైతులకోసం ఆరాటపడే వ్యక్తి కేసీఆర్ అని ఛైర్మన్ మనోహర్ రెడ్డి కొనియాడారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

డీసీసీబీల ద్వారా బంగారం కుదవపెట్టి రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. బంగారంపై రూ.3 కోట్లు చెల్లించామని.. గోదాంలకు, మిల్లులకు రుణాలిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కోటి వృక్షార్చనలో పాల్గొన్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​

TAGGED:

ABOUT THE AUTHOR

...view details