తెలంగాణ

telangana

POLICE: రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించుకున్న తిరుమలగిరి పోలీసు స్టేషన్

By

Published : Apr 16, 2023, 5:13 PM IST

Awards for Tirumalagiri Police Station: న్యాయానికి, ధర్మానికి, నీతికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనించని ఆ నాలుగో సింహమే పోలీస్.. అన్న పదాలను నిజం చేస్తు రాష్ట్రంలోనే 7 ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంక్​లో నిలిచింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసు స్టేషన్. స్టేషన్​లో నమోదయ్యే కేసుల పరిష్కారంతో పాటు.. స్టేషన్​లో మౌలిక సదుపాయాలు, పనితీరును అనుసరించి ఈ ర్యాంకులను ప్రకటించారు.

police
police

Awards for Tirumalagiri Police Station: పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసులను త్వరితగతిన ఛేదించడం. బాధితులకు న్యాయం జరిగే విధంగా సకాలంలో కోర్టులకు సమర్పించడం, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఠాణాకు వచ్చే వారికి ఉత్తమ సేవలు అందించే పోలీస్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా 30 గుర్తించి త్రైమాసికానికి ర్యాంకింగ్ ఇచ్చారు.

ఇందులో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్​కు 7వ ర్యాంకు, నేరేడుచర్ల పోలీస్ స్టేషన్​కు15వ ర్యాంకు లభించింది. ఈ ర్యాంకులు రావడం పట్ల మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వ్యక్తులు దొంగతనాలు జరిగినప్పుడు సకాలంలో స్పందించి కేసులు నమోదుచేయడం వంటివి త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.

"ప్రజల సహకారంతో మండలంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నాం. స్టేషన్​లో ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతుంది. ప్రజా సేవకులుగా నిత్యం పనిచేస్తున్నాము. 2023లో త్రైమాసికానికి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. మా పోలీస్ స్టేషన్​కు బాధ్యత మరింత రెట్టింపు చేశారు. మున్ముందు ఇదే ఉత్సాహంతో చట్ట పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ జాతీయస్థాయిలో పోటీపడేందుకు కృషి చేస్తాం"- శివ కుమార్, తిరుమలగిరి ఎస్సై

తప్పిపోయిన కేసులు, ఠాణాపరిధిలో గుర్తు తెలియని శవాలు గుర్తించినప్పుడు వారి వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం వంటిని చూడటంతో పాటు స్టేషన్​లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రికార్డుల నిర్వహణ వంటివి చూసి ఈ ర్యాంక్​లు ఇచ్చారు. ఇదే పనితీరును స్టేషన్ కొనసాగిస్తే ఉత్తమ ర్యాంకు సాంధించడానకి అర్హత లభిస్తుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రకటించిన ర్యాంక్​ను పోలీసు వ్యవస్థ నిర్వహణ మూడు నెలలలో నేరాభియోగ పత్రాలు సమర్పణ, కేసులలో శిక్షణ అమలు మహిళల పట్ల వ్యవహరించే తీరు, ఎస్సీ ఎస్టీ కేసులు, దొంగతనాలు, మిస్సింగ్ కేసుల నమోదు, ఫ్రెండ్లీ కౌన్సిలింగ్, డయల్ 100 ఫిర్యాదులపై స్పందన, రోడ్డు భద్రత అవగాహన సదస్సులు, చార్జి షీటు వేయడం, స్టేషన్​కు వచ్చిన వారితో మాట్లాడే తీరు తెన్నులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు ప్రకటించారు.

తిరుమలగిరి పోలీసు స్టేషన్​ పరిధిలో 16 గ్రామ పంచాయతీలు, 23 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. మున్సిపాలిటీ, తిరుమలగిరి, అనంతారం, మాలిపురం, నందాపురం అనే మున్సిపాలిటీలు ఉన్నాయి. స్టేషన్​లో ఒక సబ్ ఇన్స్పెక్టర్​తో పాటు ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 12 మంది పోలీసులు, నలుగురు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి: సీఎం కేసీఆర్

బంగారం స్మగ్లర్లను పట్టుకుందామని వెళితే.. పోలీసులపైనే దాడి చేశారు

'పాపులారిటీ కోసమే అతీక్ హత్య- నిందితులంతా నిరుద్యోగులు, డ్రగ్ బానిసలే'

ABOUT THE AUTHOR

...view details