తెలంగాణ

telangana

Bandi sanjay news: చివ్వెంలలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న భాజపా, తెరాస కార్యకర్తలు

By

Published : Nov 16, 2021, 11:54 AM IST

Updated : Nov 16, 2021, 1:45 PM IST

Tension over Bundi Sanjay suryapet tour
చివ్వెంలలో ఉద్రిక్తత.. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ తెరాస శ్రేణుల నినాదాలు

11:52 November 16

బండి సంజయ్‌ను అడ్డుకుంటామని తరలివచ్చిన తెరాస శ్రేణులు

చివ్వెంలలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ఉద్రిక్తత పరిస్థితుల నడుమ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay news) పర్యటన ముగిసింది. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు చివ్వెంలకు తెరాస శ్రేణులు మంగళవారం ఉదయం భారీగా తరలివచ్చారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తెరాస వర్గీయులకు పోటీగా భాజపా శ్రేణులు నినాదాలు చేసుకున్నారు. భాజపా, తెరాస(bjp vs trs news) కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. భాజపా, తెరాస వర్గాలను అదుపుచేసేందుకు పోలీసుల ముమ్మరంగా యత్నించారు. ఈ గందరగోళం మధ్యే బండి సంజయ్ పర్యటన(Bandi sanjay suryapet visit) ముగించుకున్నారు. అక్కడి నుంచి ఆత్మకూర్(ఎస్) బయల్దేరారు.  

అర్వపల్లిలో ఉద్రిక్తత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన(Bandi sanjay visit news) దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. భాజపా శ్రేణులపై తెరాస(bjp vs trs news) కార్యకర్తలు రాళ్లు రువ్వారు. తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. సంజయ్ పర్యటనలో నిరసన తెలిపేందుకు తెరాస కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు.  

అమిత్​షా ఫోన్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్​కు కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా, జేపీ నడ్డా, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఫోన్ చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బండి సంజయ్​పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్తే తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ వారికి తెలియజేశారు. దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తరుణ్ చుగ్​కి వివరించారు.

ఏం జరిగింది?

ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం బండి సంజయ్ చేపట్టిన యాత్ర(bandi sanjay nalgonda tour) సోమవారం రణరంగంగా మారింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో... తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ(trs vs bjp) ఏర్పడింది. మిర్యాలగూడ రాళ్ల దాడిలో పలువురికి గాయాలు కాగా... నేరేడుచర్లలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సంజయ్ రాక(bandi sanjay latest news) పట్ల నిరసన తెలియజేస్తామని ముందుగానే ప్రకటించిన తెరాస శ్రేణులు(trs vs bjp) అడుగడుగునా ఆయన్ను అడ్డుకున్నాయి. పరస్పర నినాదాలు, కోడిగుడ్లు, రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి విధ్వంసకరంగా మారింది. మిర్యాలగూడ, శెట్టిపాలెం, చిల్లేపల్లి వంతెన, నేరేడుచర్ల, గరిడేపల్లి, గడ్డిపల్లి ఇలా ప్రతి చోటా భారీగా తెరాస శ్రేణులు.. బండి కాన్వాయ్‌ను అడ్డుకుంటూ ఆందోళనలు చేశారు. సోమవారం రాత్రి బండి సంజయ్‌ సూర్యాపేట చేరుకునే వరకూ నిరసనలు ఆగలేదు. పెన్ పహాడ్ మండలం అనంతారం, అనాజ్ పూర్ మీదుగా సూర్యాపేట వెళ్తుండగా... అడుగడుగునా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కనిపించింది.  

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2021, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details