తెలంగాణ

telangana

రైతు వేదిక నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

By

Published : Jul 17, 2020, 6:40 PM IST

రైతులకు ఆధునిక వ్యవసాయంపై, నియంత్రిత సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాన్ని కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

suryapet collector inspected farmer's platforms in district
రైతు వేదిక నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సూర్యాపేట జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాన్ని శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ, సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్​ తెలిపారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, వారికి శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రం నుంచి గ్రామంలోకి వచ్చే దారి వెంట హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటించాలని చరవాణిలో పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, ఎంపీడీవో సరోజ, తహసీల్దార్ రాంప్రసాద్, సర్పంచ్ ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందేలా కృషి'

ABOUT THE AUTHOR

...view details