తెలంగాణ

telangana

శానిటైజర్ ఇవ్వని ఫలితం.. ఆర్టీసీ డీఎంపై వేటు..

By

Published : May 20, 2020, 7:41 PM IST

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన.. ఆర్టీసీ అధికారిపై రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. బస్సులో శానిటైజర్ లేకపోవడం వల్ల కోదాడ డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్​ను తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Sooryapet District Kodada RTC DM suspended
సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిఎం సస్పెండ్

సూర్యాపేట జిల్లా కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును.. ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజాయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. బస్సులో శానిటైజర్ లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిఎం సస్పెండ్

వెంటనే నల్గొండ ఆర్ఎం వెంకన్నతో ఫోన్లో మాట్లాడి.. కోదాడ డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్​ను తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమాలు తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ABOUT THE AUTHOR

...view details