తెలంగాణ

telangana

బాలికపై అత్యాచారయత్నం.. ఆ భయంతో చిన్నారి..!

By

Published : Nov 14, 2022, 8:48 PM IST

Rape Attempt on Minor Girl: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనానికి పిలుద్దామని వెళ్లిన చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ భయంతో అనారోగ్యం పాలైన బాధిత బాలిక.. మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. అసలేమైందంటే..?

మైనర్ బాలికపై అత్యాచారయత్నం
మైనర్ బాలికపై అత్యాచారయత్నం

Rape Attempt On Minor Girl: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో దారుణం చోటుచేసుకుంది. ​ బాలికపై 24 ఏళ్ల ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఓ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. కూతురి భర్త చనిపోవడంతో 12 ఏళ్లుగా ఆమెను తమ వద్దే ఉంచుకుని సాకుతున్నారు. ఆమెకు ఓ కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలోనే గత నెలలో దసరా పండగ రోజు తమ పక్కింట్లో ఉండే అంజయ్య తల్లిని భోజనానికి పిలవాలని బాధితురాలి అమ్మమ్మ చెప్పడంతో ఆమెను పిలిచేందుకని చిన్నారి పక్కింట్లోకి వెళ్లింది. ఆ సమయంలో అంజయ్య కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. అంజయ్య కుమారుడు రాజు(24) ఒక్కడే ఉన్నాడు.

ఇదే అదనుగా భావించిన నిందితుడు రాజు ఇంటి తాళం చెవి పోయిందని.. దానిని వెతికేందుకు సాయం చేయాలంటూ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. తాళం వెతుకుతున్న క్రమంలో ఇంట్లో ఉన్న సజ్జలపై ఉందేమో చూడాలంటూ చిన్నారిని ఎత్తుకుని అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అత్యాచారయత్నం చేశాడు. ఏం జరిగిందో తెలియని ఆ చిన్నారి.. అప్పటి నుంచి ఆ ఘటన నుంచి బయటకు రాలేకపోయింది. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైంది. కుటుంబసభ్యులు చిన్నారిని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో నిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక నేడు మృతి చెందింది.

కామాంధుడు రాజు అత్యాచారయత్నం చేయడం వల్లే.. ఆ భయంతోనే తమ చిన్నారి అనారోగ్యం పాలై చనిపోయిందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బాధిత చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details