తెలంగాణ

telangana

పెద్దలు నిరాకరిస్తే.. పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట!

By

Published : Apr 19, 2021, 5:07 PM IST

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పెద్దలు అందుకు నిరాకరించారు. చేసేది లేక పోలీసులనాశ్రయించారు. పోలీసు స్టేషన్​లో ఒక్కటయ్యారు.

police did lovers marriage, lovers got marriage in police station
పోలీసు స్టేషన్​లో ప్రేమికుల పెళ్లి, ప్రేమికుల పెళ్లి చేసిన పోలీసులు

పెద్దలు నిరాకరించారని పోలీసుల సమక్షంలో ఒక్కటైంది ఓ ప్రేమజంట. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓ ఆకుల సందీప్, చీర భవ్య గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.

ఇద్దరూ మేజర్లు కావడంతో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మద్దిరాల పోలీసులను సంప్రదించారు. ఇరువురి తల్లిదండ్రులకు ఎస్సై బండి సాయి ప్రశాంత్ నచ్చజెప్పారు. పోలీసుల చొరవతో పెద్దల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటైంది.

ఇదీ చదవండి:అమ్మయ్యాక కూడా ఇలా అందంగా మెరిసిపోదాం!

ABOUT THE AUTHOR

...view details