తెలంగాణ

telangana

'ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం వెంటనే చెల్లించాలి'

By

Published : Aug 29, 2020, 9:05 AM IST

సిద్దిపేట జిల్లాలో పెండింగ్​లో ఉన్న అట్రాసిటీ కేసుల పరిహారం వెంటనే చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

telangana sc st commission chairman errolla srinivas on atrocity case exgratia
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం

ప్రజలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. అధికారుల అట్రాసిటీ కేసుల పరిహారం ప్రత్యేక శ్రద్ధ వహించి బాధితులకు తక్షణమే పరిహారం అందేలా చేయాలని కోరారు.

సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు పెండింగ్​లో ఉన్న పరిహారం కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగదేవపూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన కేసు పరిహారం మూడ్రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ, గిరిజన ప్రజలకు అండగా ఉండటమే గాక ప్రభుత్వ సంక్షేమ పథఖాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేస్తోందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details