తెలంగాణ

telangana

'పేదరికమే ప్రామాణికంగా 'డబుల్' లబ్ధిదారుల ఎంపిక'

By

Published : Dec 17, 2020, 12:46 PM IST

పేదప్రజల ముఖాల్లో ఆనందపు వెలుగు నింపేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్​నగర్​లో రెండో విడత లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు అందజేశారు.

harish rao inaugurated double bedroom houses
సిద్దిపేటలో డబుల్​ బెడ్​రూం ఇళ్ల ప్రారంభం

పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్​ బెడ్​రూం ఇళ్ల పథకం ప్రారంభించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఖర్చుకు వెనకాడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్​నగర్​లో రెండో విడత లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను మంత్రి హరీశ్ రావు అందజేశారు. పేదరికమే ప్రామాణికంగా అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 144 మంది గృహప్రవేశం చేయగా.. గురువారం రోజు 180 మంది తమ సొంత ఇళ్లలోకి ప్రవేశించారని తెలిపారు. మరో వేయి ఇళ్ల కోసం లబ్ధిదారుల పునఃపరిశీలన జరుగుతోందని వెల్లడించారు.

అనంతరం కేసీఆర్​నగర్​ నుంచి సిద్దిపేట పట్టణంలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసును మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details